హైదరాబాద్‌ నగరంలో హైడ్రా(Hydra) దూకుడు ప్రదర్శిస్తోంది.

హైదరాబాద్‌ నగరంలో హైడ్రా(Hydra) దూకుడు ప్రదర్శిస్తోంది. సినీనటుడు మురళీమోహన్‌కు(Murali mohan) చెందిన జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌కు(Jayaberi convention) హైడ్రా తాజాగా నోటీసులిచ్చింది(Notice). గచ్చిబౌలిలోని రంగాల్‌కుంట చెరువులో జయభేరికి చెందిన అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని నోటీసుల్లో పేర్కొంది. లేని పక్షంలో తామే కూల్చివేస్తామని హెచ్చరించింది. ఇదిలా ఉంటే, ఉదయం దుండిగల్‌ పరిధిలోని మల్లంపేట కత్వా చెరువులోని అక్రమ విల్లాలు, మదాపూర్‌లోని సున్నం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. ఇక్కడ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మియాపూర్‌లోని స్వర్ణపురి కాలనీలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌లోనూ అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. హెచ్‌ఎంటీ నగర్‌, వాణి నగర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story