తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ కేడర్‌ విభజనలో ఆసక్తికరమైన పరిణామం జరిగింది

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ కేడర్‌ విభజనలో ఆసక్తికరమైన పరిణామం జరిగింది. తమను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలంటూ డీవోపీటీ ఆదేశాలు జారీ చేసిందని, ఆ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్‌ అధికారులు వాకాటి కరుణ, వాణి ప్రసాద్‌, ఆమ్రపాలి సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ (CAT)లో పిటిషన్‌ దాఖలు చేశారు. తెలంగాణలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఏపీలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్‌ అధికారిణి సృజన కోరారు. వారి పిటిషన్లపై కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ మంగళవారం విచారణ చేపట్టనుంది. ఇదిలా ఉంటే తెలంగాణ సీఎస్‌ శాంతికుమారితో ఏపీ కేడర్‌ ఐఏఎస్,ఐపీఎస్ అధికారులు సమావేశమయ్యారు. సీఎస్‌తో వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, అమ్రాపాలితో పాటు పలువురు అధికారులు భేటీ అయ్యారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story