తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్‌ ఐఏఎస్‌గా పేరుతెచ్చుకున్న అమ్రపాలి రెడ్డి

తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్‌ ఐఏఎస్‌గా పేరుతెచ్చుకున్న అమ్రపాలి రెడ్డి.. ఇంకా ఏపీలోనే కొనసాగుతున్నారు. గతంలో ఆమెను తెలంగాణ నుండి ఏపీ క్యాడర్‌ కు పంపించారు. ఆ తర్వాత మళ్లీ తెలంగాణకు కేటాయిస్తూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఆదేశాలిచ్చింది. దీంతో ఆమె తెలంగాణకు రావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ఆంద్రప్రదేశ్ లోనే కొనసాగుతున్నారు. రెండు రోజులుగా ఆంద్రప్రదేశ్ లో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆమె కనిపించారు. దీంతో ఆమె ఇంకా అక్కడే ఎందుకు ఉన్నారన్న చర్చ మొదలైంది.2024 అక్టోబర్‌లో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జూన్‌లో ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులిచ్చింది. గతంలో ఏపీ, తెలంగాణ కేడర్ లో ఉన్న పలువురు అధికారులను తెలంగాణ నుంచి ఏపీకి పంపిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ నిర్ణయం తీసుకుంది. అమ్రపాలి, రొనాల్డ్ రాస్..మరికొందరు అధికారులు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిపోయారు. కొందరు ఐపీఎస్ అధికారులను కూడా ఏపీ కేడర్‌కు పంపించారు.

ఆమ్రపాలి కాటా 2010 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కేడర్ అధికారిగా ఆమె ఉండేవారు. అయితే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. కానీ తాను తెలంగాణలోనే కొనసాగుతానని ఆమె క్యాట్‌ను ఆశ్రయించారు.తన తల్లిదండ్రులు హైదరాబాద్‌లో నివసిస్తారని తనకు అక్కడే అవకాశం కల్పించాలని కోరారు. అయినా ఆమెను ఏపీకి పంపించారు. అక్కడ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు ఇచ్చారు. ఈ క్రమంలో తెలంగాణకు కేటాయిస్తూ జూన్ లోనే ఉత్తర్వులు వచ్చినా ఇంకా ఆమె రిలీవ్ కాలేదు. గతంలో తెలంగాణలో కీలక పోస్టుల్లో ఆమె పనిచేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేశారు. అలాగే హెచ్ఎండీఏతో పాటు.. ఒకేసారి ఐదారు కీలక పదవులను నిర్వర్తించారు.తెలంగాణకు కేటాయించిన తర్వాత కూడా ఆమె అక్కడే ఎందుకు ఆగిపోయారన్నది చర్చ జరుగుతోంది.

ehatv

ehatv

Next Story