✕
IAS officer-Minister affair Case: IAS అధికారిణి-మంత్రి ఎఫెర్..! కథనాలపై పోలీసుల యాక్షన్..!

x
ఐఏఎస్ అధికారిణి, మంత్రి మధ్య కథనాలపై పోలీసుల సీరియస్ అయ్యారు. ఎన్టీవీ, తెలుగుస్క్రైబ్ సహా పలు డిజిటల్ మీడియా చానెళ్లపై కేసులను సీసీఎస్ పోలీసులు నమోదు చేశారు. కాగా గత వారం ఓ ఐఏఎస్ అధికారిణి, తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రి మధ్య ఏం జరుగుతుందంటూ ఓ కథనం రావడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా సంచలనంగా మారింది. దీనిపై ఆ మంత్రి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇంత విషమిచ్చి చంపడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్టీవీ కథనంపై విచారణకు IAS అధికారుల సంఘం డిమాండ్ చేసింది. IAS సంఘం ఫిర్యాదుతో పలు మీడియా చానెళ్లపై కేసులు నమోదు చేశారు. ఎన్టీవీ, తెలుగుస్క్రైబ్, టీన్యూస్, మిర్రర్ అఫిషియల్, ప్రైమ్9 తెలంగాణ, పీవీ న్యూస్, ఓల్గా న్యూస్, ఎం.ఆర్.మీడియా తెలంగాణ వంటి డిజిటల్ న్యూస్‌లపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు

ehatv
Next Story

