హైదరాబాద్‌లోని నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్‌లోని నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. బాచుపల్లిలోని నారాయణ​ కాలేజీలో ఇంటర్మీడియట్‌ విద్యార్థిని అనూష హాస్టల్‌ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనూష ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతోంది. ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం తొలుత విద్యార్థి పేరెంట్స్‌కు స్పృహ తప్పి కిందపడిపోయినట్టు సమాచారం ఇచ్చారు. దీంతో, పేరెంట్స్‌ కాలేజీకి బయలుదేరారు. తల్లిదండ్రులు కాలేజీకి వెళ్లే సరికి అనూష ఉరి వేసుకొని చనిపోయిందని యాజమాన్యం తెలిపింది. పేరెంట్స్‌ కాలేజీకి రాకముందే అనూష మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించింది నారాయణ కాలేజీ యాజమాన్యం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story