అసెంబ్లీ హాల్లోకి ప్రవేశించిన వెంటనే కేసీఆర్ వద్దకు రేవంత్‌రెడ్డి వెళ్లి కరచాలనం చేశారు.

అసెంబ్లీ హాల్లోకి ప్రవేశించిన వెంటనే కేసీఆర్ వద్దకు రేవంత్‌రెడ్డి వెళ్లి కరచాలనం చేశారు. సభలో కేసీఆర్‌ను పలకరించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడారు. అయితే సభ ప్రారంభమైన తర్వాత కేసీఆర్ కేవలం మూడు నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉన్నారు. అనంతరం ఎలాంటి ప్రసంగం చేయకుండా సభ నుంచి నిష్క్రమించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం–మాజీ సీఎం మధ్య జరిగిన క్షణిక భేటీ, కేసీఆర్ తక్షణ నిష్క్రమణపై రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. అయితే మిగతా సభ్యుల అందరికంటే ముందుగానే వెళ్లి తన చైర్‌లో ప్రతిపక్ష నేత కేసీఆర్ (KCR)కూర్చున్నారు. కేసీఆర్‌ను కలిసిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభత్వ విప్‌లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీపీఐ ఎమ్మెల్యే కునమనేని సాంబశివరావు. కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్న నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్

Updated On
ehatv

ehatv

Next Story