ఇంగ్లిష్‌ మీడియంలో(English medium) చదవడం కష్టంగా మారింది ఆ అమ్మాయికి.

ఇంగ్లిష్‌ మీడియంలో(English medium) చదవడం కష్టంగా మారింది ఆ అమ్మాయికి. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీషు మీడియం లోకి రావడం తో ఆ విద్యార్థిని చాలా ఇబ్బంది పడింది. తట్టుకోలేక ఆత్మహత్య(Suicide) చేసుకుంది.

ఈ ఘటన మంచిర్యాల(Manchirial) జిల్లా భీమారం(Bhimavaram) మండలం పోతన్‌పల్లిలో(Pothan) జరిగింది. వివరాల్లోకి వెళితే, పోతన్‌పల్లికి చెంది నలాటుకూరి బానేశ్‌(Banesh)-కవితకు(Kavitha) ఇద్దరు పిల్లలు. పెద్దకూతురు అనుశ్రీ (16) రామకృష్ణాపూర్‌లోని(Ramakrishnapur) కస్తుర్బాలో(Kasturba) ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నది. పది వరకు తెలుగు మీడియం చదివింది. ఇప్పుడు. ఇంగ్లిష్‌ మీడియం కావడంతో ఇబ్బంది పడుతూ వ చ్చింది. తెలుగుమీడియంలో చేర్పించాలని తండ్రికి పలుమార్లు చెప్పింది. రెండో సంవత్సరంలో తెలుగు మీడియంలో చేర్పిస్తానని తండ్రి చెప్పాడు. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. కుటుంబ సభ్యులు మంచిర్యాల హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. అప్పటికీ పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్ లో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి చనిపోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story