మొబైల్ ఫోన్లు(Mobil Phones) ఎక్కడో ఒక్కో చోట పేలుతున్న(Blast) వార్తలు నిత్యం వస్తూనే ఉన్నాయి. ఫోన్ చార్జింగ్(Phone charge) పెట్టినప్పుడు, చార్జింగ్ పెడుతూ ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు ఇవి పేలుతున్నాయి. ఈ ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు. ఇలాంటి ప్రమాదంలో మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఫోన్‌ను జేబులో పెట్టుకున్నాడు.

Jio Mobile Blast
మొబైల్ ఫోన్లు(Mobil Phones) ఎక్కడో ఒక్కో చోట పేలుతున్న(Blast) వార్తలు నిత్యం వస్తూనే ఉన్నాయి. ఫోన్ చార్జింగ్(Phone charge) పెట్టినప్పుడు, చార్జింగ్ పెడుతూ ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు ఇవి పేలుతున్నాయి. ఈ ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు. ఇలాంటి ప్రమాదంలో మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఫోన్‌ను జేబులో పెట్టుకున్నాడు. అయితే అది అనుకోకుండా పేలిపోయింది. ప్యాంట్ చినిగిపోవడంతో సెల్‌ఫోన్ కిందపడి ఎలాంటి ప్రమాదం జరగలేదు. జోగులాంబ(Jogulamba) గద్వాల(Gadwal) జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గద్వాలలోని కూరగాయల మార్కెట్‌లో(Vegetable Market) బీసీ కాలనీకి(BC Colony) చెందిన జయరాముడు అనే వ్యక్తి జేబులో ఉన్న జియో సెల్‌ఫోన్(Jio Cell Phone) పేలి మంటలు అంటుకున్నాయి. అతడు వేసుకున్న ప్యాంట్‌కు రంధ్రం ఏర్పడి ఆ సెల్‌ఫోన్ కిందపడిపోవడంతో ప్రమాదం తప్పింది. జయమరాముడికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో అక్కడున్న స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు


