మెడిసిన్‌ చదువుతున్న ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. చదవడం కష్టంగా ఉండటంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైంది. ఆ ఒత్తిడితోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్‌లోని విద్యానగర్‌లో ఈ సంఘటన జరిగింది.

మెడిసిన్‌ చదువుతున్న ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. చదవడం కష్టంగా ఉండటంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైంది. ఆ ఒత్తిడితోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్‌(Karimnagar)లోని విద్యానగర్‌(Vidyanagar)లో ఈ సంఘటన జరిగింది. కోమళ్ల ప్రహ్లాదరావు(Komalla Prahlada Rao), పద్మజ(Padmaja) దంపతులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో పని చేస్తున్నారు. ఆ దంపతుల కూతురు కోమళ్ల శిరీష(Komala Shirisha) (20) అదే కాలేజీలో ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం చదువుతోంది. చదువు కష్టంగా ఉందని చాలా సార్లు తల్లిదండ్రులతో తన బాధను పంచుకుంది శిరీష. అయితే తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆ అమ్మాయి తీవ్ర ఒత్తిడికి గురైంది. శనివారం కాలేజీ నుంచి ఇంటికి వచ్చి చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. మధ్యాహ్నం తల్లి ఇంటికొచ్చేసరికి కూతురు ఉరి వేసుకుని ఉండటం చూసి ఆందోళన చెందింది. స్థానికుల సాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే శిరీష చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. ప్రహ్లాదరావు ఫిర్యాదు మేరకు కరీంనగర్‌ టూటౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story