న్యూడ్‌ వీడియో కాల్స్‌(Nude Video Calls) ఎవరినీ వదలిపెట్టడం లేదు. సాధారణ ప్రజలే ఈ న్యూడ్‌ వీడియో కాల్ బారిన పడి మోసపోయిన సంఘటనలు చాలా చూశాం.

న్యూడ్‌ వీడియో కాల్స్‌(Nude Video Calls) ఎవరినీ వదలిపెట్టడం లేదు. సాధారణ ప్రజలే ఈ న్యూడ్‌ వీడియో కాల్ బారిన పడి మోసపోయిన సంఘటనలు చాలా చూశాం. కానీ హైప్రొఫైల్‌ వారినీ వీరు వదిలిపెట్టడం లేదు. తాజాగా తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే(MLA) కూడా దీని బారినపడ్డారు. ఉమ్మడి కరీంనగర్‌(Karimnagar) జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు ఈ నెల 14న అర్ధరాత్రి దాటిన తర్వాత వీడియోకాల్‌ వచ్చింది. వాట్సాప్‌లో కాల్‌ రావడంతో ఎమ్మెల్యే ఆ కాల్‌కు ఆన్సర్‌ ఇచ్చారు. గుర్తుతెలియని నంబర్‌ నుంచి వచ్చిన ఆ వీడియోకాల్‌ను ఎమ్మెల్యే ఆన్సర్‌ చేశారు. ఫోన్‌ లిఫ్ట్ చేసిన మరుక్షణంలోనే తెరపైకి ఓ మహిళ నగ్నంగా కనిపించింది. ఆందోళన చెందిన వెంటనే ఎమ్మెల్యే కాల్‌ కట్‌ చేశారు. తనపై ఎవరో కుట్ర పన్నారని భావించిన ఎమ్మెల్యే వెంటనే కాల్‌ను బ్లాక్‌చేసి సైబర్‌ క్రైం పోర్టలకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోకు(cybersecurity) కూడా లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎమ్మెల్యేకు వచ్చిన నెంబర్‌ను ట్రేస్‌ చేసే పనిలో పడ్డారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story