Kavitha Joins Congress: No surprise if Kavitha joins Congress: Congress MLA's sensational comments..!

కవిత కాంగ్రెస్‌లో చేరినా ఆశ్చర్యం లేదని, గతంలో దానం నాగేందర్, కడియం శ్రీహరి వంటి నేతలు కాంగ్రెస్‌లోకి వస్తారని అనుకున్నా.. అనుకున్నట్టుగానే వచ్చారని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా పేరు మార్పు అనేది ఊహాగానమే అని, రంగారెడ్డి జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలు అయినా చేసుకోవచ్చు.. కానీ జిల్లా స్వరూపం మారొద్దని డిమాండ్ చేశారు. రెండు కోట్ల మంది ప్రజలు ఉన్న జిల్లాకు ఇంత వరకు మంత్రి పదవి ఇవ్వలేదు. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకే నష్టం..నాకు నష్టం లేదు ,పార్టీ పెద్దలు ఈ విషయంపై ఆలోచించాలని కోరారు. ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో రియల్ భూమ్ పెరిగిందని.. భూముల రేట్లు పెరుగుతున్నాయని భూములు ఎవరూ అమ్మడం లేదని మల్‌రెడ్డి అన్నారు. ఫార్మాసిటీపై పోరాటం చేసినందుకే గతంలో నన్ను కేసీఆర్ ఓడగొట్టాడు. ఫార్మాసిటి వచ్చి ఉంటె 50 కిలోమీటర్ల మేరా పొల్యూషన్ అయ్యేదని ఆయన అన్నారు.


