తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత-మల్లన్న మధ్య వివాదం చోటు చేసుకుంది.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత-మల్లన్న మధ్య వివాదం చోటు చేసుకుంది. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో ఆమె అనుచరులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా కవిత, మల్లన్న మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే బీఆర్ఎస్ వైపు నుంచి మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మినహాయించి, ఏ ఒక్కరూ స్పందించకపోవడం గమనార్హం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, సోదరుడైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు , రాజ్యసభ సభ్యుడు సంతోష్‌రావు తదితర కుటుంబ ఈ వ్యాఖ్యలను పట్టించుకోకపోవడం చర్చ నీయాంశమైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై పోరాటం అంటూ తెలంగాణ జాగృతి తరపున కవిత కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కవిత సొంత ఎజెండాతో వెళుతున్న తీరును బీఆర్ఎస్ పెద్దలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ వ్యతిరేకించే చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి, తనను తండ్రి, అన్న పట్టించుకోలేదన్న సంకేతాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా కేసీఆర్, కేటీఆర్‌తో పాటు కుటుంబ సభ్యులకు కోపం తెప్పించాయని సమాచారం. అందుకే తీన్మార్ మల్లన్న అనుచిత కామెంట్స్, ఆ తర్వాత పరిణామాలపై బీఆర్ఎస్ సంయమనంతో వ్యవహరిస్తోంది.
