మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాలపై కొత్త నిబంధనలు పెట్టిన రాజగోపాల్ రెడ్డి.

మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాలపై కొత్త నిబంధనలు పెట్టిన రాజగోపాల్ రెడ్డి. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకే మద్యం దుకాణాలు తెరిచి ఉండాలని, పర్మిట్ రూంలు ఉండొద్దని రాజగోపాల్ రెడ్డి షరతులు. దీంతో టెండర్లు వేయడానికి భయపడి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మద్యం వ్యాపారులు వెళ్లారు. ఈ విషయంపై స్పందిస్తూ,రాష్ట్రమంతా ఒకటే రూల్ ఉంటుంది, ఒక్కో నియోజవర్గానికి ఒక్కో నిబంధన ఉండదని, అందరూ ఫాలో అవ్వాల్సిందే అంటూ జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై, ప్రభుత్వం అధిష్టానానికి పూర్తి నివేదిక పంపినట్లు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల మధ్య సఖ్యత లోపించడం, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోవడంపై విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు జూపల్లి-రాజ్‌గోపాల్‌రెడ్డి అంశం తెరపైకి రావడంతో మరోసారి చర్చ మొదలైంది.
