తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌(Konatham Dileep)ను పోలీసులు అరెస్ట్ చేశారు.

తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌(Konatham Dileep)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌ను బీఆర్‌ఎస్‌ పార్టీ(BRS Party)నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రజా పాలన అంటే ప్రశ్నించే వారి గొంతు నొక్కడమేనా? అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR) కాంగ్రెస్‌ సర్కారును ప్రశ్నించారు. కొంతకాలంగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్న దిలీప్‌ను కొన్ని రోజుల కిందట కూడా తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టాలని చూసింది ప్రభుత్వం. అయితే హైకోర్టు అక్షింతలు వేయడంతో వదిలిపెట్టింది. ఈసారి కూడా ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో కూడా చెప్పకుండా అరెస్ట్‌ చేశారని కేటీఆర్‌ ఆరోపస్తున్నారు. మరోవైపు బషీర్‌బాగ్‌(basheerbagh)లోని సిసిఎస్ కార్యాలయానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి(MLA Jagadeesh Reddy),పార్టీ సీనియర్ నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి, దాసోజు శ్రవణ్(Dasoju Sravan), ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar),కార్తీక్ రెడ్డి(Karthik Reddy)మరియు పలువురు పార్టీ సీనియర్ నేతలు చేరుకున్నారు. దిలీప్ అరెస్టుపై పోలీసు అధికారులను ప్రశ్నిస్తున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story