తెలంగాణ(Telangana)సీఎస్‌ శాంతి కుమారికి (Cs Shanthi Kumari)బీఆర్‌ఎస్‌ (Brs)వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌(Ktr)ఓ విన్నపం చేశారు

తెలంగాణ(Telangana)సీఎస్‌ శాంతి కుమారికి (Cs Shanthi Kumari)బీఆర్‌ఎస్‌ (Brs)వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌(Ktr)ఓ విన్నపం చేశారు. తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్‌లు(Website), సోషల్‌ మీడియా(Social media) హ్యాండిల్‌ల డిజిటల్ విధ్వంసానికి సంబంధించి దయతో జోక్యం చేసుకుని చర్యను వేగవంతం చేయాలని సీఎస్‌ను కోరారు. ఈ విషయాన్ని మళ్లి గుర్తుచేస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌ (ట్విట్టర్‌)లో కేటీఆర్‌ ఓ పోస్ట్ పెట్టారు. తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్ల నుంచి , ఇతర ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ (Kcr)హయాంలోని ముఖ్యమైన కంటెంట్ తొలగించారని కేటీఆర్‌ అన్నారు. ఈ కంటెంట్ ప్రజల ఆస్తి, తెలంగాణ చరిత్రలో అంతర్భాగమని చెప్పారు. ఈ డిజిటల్ ఆస్తులను రక్షించడానికి, భవిష్యత్ తరాలకు ఈ విషయాన్ని భద్రపరచడానికి మీ తక్షణ చర్య అవసరమని, మీ నుంచి చర్య తీసుకోకుంటే, మేము న్యాయపరమైన పరిష్కారాన్ని కోరవలసి వస్తుందని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Updated On
ehatv

ehatv

Next Story