బీఆర్‌ఎస్‌ సర్కారు క్రెడిట్‌ను ఇంకా ఎంత కొట్టేస్తారు...?

కేసీఆర్‌(KTR) ప్రభుత్వం ఘనతలను తమ ఖాతాలో వేసుకోవడం కాంగ్రెస్‌(congress) ప్రభుత్వానికి అలవాటుగా మారిందని బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్(KTR) అన్నారు. మొన్న 30 వేల ఉద్యోగాలు మీరే ఇచ్చారన్నారు. నిన్న కాగ్నిజెంట్‌ కంపెనీనీ(Cognizent company) మీరే తెచ్చామన్నారు. నేడు సీతారామ ప్రాజెక్టును మీరే కట్టారంటున్నారు. మా కష్టాన్ని ఎన్ని సార్లు మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తారు. హద్దు మీరిన అబద్ధాలతో ఇంకా ఎన్నిసార్లు మభ్యపెట్టాలని చూస్తారు అంటూ కేటీఆర్‌ ఎక్స్‌లో రాసుకొచ్చారు. మీరు శ్రీకారం చుట్టి, మీరే లక్ష్యాన్ని చేర్చిననాడు అది మీ సమర్థతకు ప్రతీక అవుతుందే తప్ప బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం క్రెడిట్‌ను కొట్టేసే ప్రయత్నం మీరు ఎంత చేసినా నాలుగు కోట్ల ప్రజానీకం మాత్రం నమ్మదు. తెలంగాణ సమాజం ఎప్పటికీ విశ్వసించదు అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story