తాను డ్రగ్స్ వాడినట్లు, పలువురు ఫోన్‌ ట్యాపింగ్‌ చేసినట్లు వ్యాఖ్యానించిన కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు ఇచ్చారు.

తాను డ్రగ్స్ వాడినట్లు, పలువురు ఫోన్‌ ట్యాపింగ్‌ చేసినట్లు వ్యాఖ్యానించిన కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కేటీఆర్‌(KTR) లీగల్‌ నోటీసులు ఇచ్చారు. తన పరువుకు నష్టం కల్గించేలా వ్యాఖ్యానించారని.. వారంలోగా తనకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్‌ నోటీసులో పేర్కొన్నారు. లేదంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అసత్య ఆరోపణలు చేస్తే ఎవరినీ వదిలిపెట్టేది లేదని కేటీఆర్‌ అన్నారు. అయితే కేటీఆర్‌ నోటీసులపై బండి సంజయ్‌(Bandi Sanjay) స్పందించారు. తనను అవమానపర్చేలా మాట్లాడితేనే తాను వ్యాఖ్యలు చేశానని.. తాను కూడా కేటీఆర్‌కు లీగల్‌ నోటీసులు పంపిస్తానని బండి సంజయ్‌ అన్నారు. మాటకు మాట బదులు ఉంటుంది.. నోటీసుకు నోటీసుల బదులు ఉంటుందన్నారు. లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తేలేదన్నారు బండి సంజయ్.

Updated On
ehatv

ehatv

Next Story