ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth reddy) అన్న తిరుపతిరెడ్డికి(Tiruathi reddy) బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎక్స్‌ వేదికగా కొన్ని ప్రశ్నలను సంధించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth reddy) అన్న తిరుపతిరెడ్డికి(Tiruathi reddy) బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎక్స్‌ వేదికగా కొన్ని ప్రశ్నలను సంధించారు. 'అనుముల తిరుపతి రెడ్డిగారు... ఎల్‌కేజీ చదువుతున్న వేదశ్రీకి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు. 50 ఏళ్ల కస్తూరి బాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది. 72 గంటల కిందట కొన్ని ఇల్లు నేల మట్టమయ్యింది. వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు, అన్ని కాగితాలు ఉన్నా పేక మేడలా కూల్చివేయబడింది. తిరుపతి రెడ్డి గారు, క్షణం కూడా సమయం ఇచ్చే ప్రసక్తే లేదన్న హైడ్రా(Hydra).. మీ విషయంలో నోరు మెదపలేదు!' వాల్టా అనుకుంటా.. ఏకంగా మీకు 30 రోజుల టైం ఇచ్చింది! కోర్టులో స్టే సంపాదించుకున్నారు!. ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణకాష్టంలో మట్టి కూడా అంటనిది బహుశా మీకు మాత్రమేనేమో!. మీ సోదరుడి బుల్‌డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు ఆ కిటుకేదో చెప్పండి!’అంటూ కేటీఆర్‌ వ్యంగ అంటూ కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలను విసిరారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story