బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌పై(KTR) మంత్రి కొండా సురేఖ(Konda surekha) సంచలన ఆరోపణలు చేశారు

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌పై(KTR) మంత్రి కొండా సురేఖ(Konda surekha) సంచలన ఆరోపణలు చేశారు. నాగచైతన్య(Naga chaithanya)-సమంత(Samantha) విడాకులకు కేటీఆర్(KTR) కారణమన్నారు. హీరోయిన్లకు డ్రగ్స్‌(Drugs) అలవాటు చేసింది కేటీఆరేనని చెప్పారు. ఇంకా చాలా అన్నారు. కొంచెం భావోద్వేగానికి కూడా లోనయ్యారు. కొండా సురేఖ మాటలకు కేటీఆర్‌ ఘాటుగానే రిప్లై ఇచ్చారు. 'దొంగ ఏడుపులు, పెడబొబ్బలు దేనికక్కా.. ఇదే సోషల్ మీడియాలో మాపైన ట్రోలిం్‌ పేరుతో దాడి జరగలేదా? కొండా సురేఖ ఇంతకు ముందు మాట్లాడిన బూతు మాటలను గుర్తుకు తెచ్చుకుంటే మంచిది. హీరోయిన్ల ఫోన్లు టాప్ చేశారని కామెంట్లు చేశారు. ఆమె ఆరోపణలు చేసిన వాళ్లు మహిళలు కాదా? వాళ్లకు మనోభావాలు ఉండవా? మాపైన అడ్డగోలు ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న మహిళలు బాధపడ లేదా? వాళ్లు ఏడ్వరా? ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలన్నింటినీ మీకు, మంత్రులకు పంపిస్తా. వెంటనే ముఖ్యమంత్రి నోటిని ఫినాయిల్‌తో కొండా సురేఖ, మంత్రులు కలిసి కడగాలి' అని కేటీఆర్‌ చెప్పారు

Updated On
Eha Tv

Eha Tv

Next Story