పెరిగిన ఆర్టీసీ చార్జీలతో మధ్యతరగతి ప్రజలపై అధిక భారం పడుతుందని వాపోతున్నారు.

పెరిగిన ఆర్టీసీ చార్జీలతో మధ్యతరగతి ప్రజలపై అధిక భారం పడుతుందని వాపోతున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చి పురుషులపై అత్యధిక భారాన్ని మోపుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆర్టీసీ చార్జీలపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. సయీద్ జుబేర్ అనే వ్యక్తి కేటీఆర్‌ను ట్యాగ్‌ చేస్తూ.. ''పటాన్‌చెరు నుండి DLFకి మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు ఛార్జీ రూ.30 నుండి రూ.45 కి పెరిగింది. ఇది రూ.15 పెంపు. ఇది రోజువారీ ప్రయాణికులపై భారం మోపుతోంది. దయచేసి అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తండి మరియు ప్రజలకు సహాయం చేయండి. మెరుగైన అభివృద్ధి కోసం నేను కాంగ్రెస్‌కు ఓటు వేసాను కానీ ఇది చాలా ఎక్కువ అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRను ట్యాగ్ చేశారు. దీనిపై KTR స్పందించడం ఆసక్తికరంగా మారింది. ఆయన స్పందిస్తూ '' మీరు చెప్పినట్లుగా మీరు కాంగ్రెస్‌కు ఓటు వేసి ఉంటే, మీ ప్రశ్నకు వారే సమాధానం చెప్పాలని మీరు కోరుకోవడం లేదా... భారీ ఎత్తున చార్జీ పెంచడాన్ని వ్యతిరేకంగా మేము మా గళాన్ని అసెంబ్లీలో వినిపిస్తాము'' అని KTR అన్నారు.

Updated On
ehatv

ehatv

Next Story