బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు(KTR) రాజవర్ధన్‌రెడ్డి(Rajavardhan reddy) అనే అభిమాని ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పోస్టాఫీస్‌(Post office) నుంచి ఉత్తరం(Letter) రాశారు.

బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు(KTR) రాజవర్ధన్‌రెడ్డి(Rajavardhan reddy) అనే అభిమాని ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పోస్టాఫీస్‌(Post office) నుంచి ఉత్తరం(Letter) రాశారు. ఎంతో అభివృద్ధి చేసిన బీఆర్‌ఎస్‌ ఓడిపోవడం బాధాకరమని.. మరోసారి కేసీఆర్‌(KCR) ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు లేఖలో ఉంది. లేఖరాసి ఎక్స్‌ ద్వారా కేటీఆర్‌కు తెలిపాడు అభిమాని. 'ప్రియమైన @KTRTRS గారూ, సముద్ర మట్టానికి 15,000 అడుగుల ఎత్తులో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోస్టాఫీసు నుంచి నేను మీకు ఇటీవల ఒక లేఖ పంపాను. ఇప్పటికి 10 రోజులు అయ్యింది, అది మీకు చేరిందో లేదో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. మీరు దాన్ని స్వీకరించినట్లు గుర్తించగలిగితే అది నిజంగా నా రోజుగా మారుతుంది. ధన్యవాదాలు' అంటూ రాజవర్ధన్‌రెడ్డి ట్వీట్‌ రాశారు. దీనికి కేటీఆర్‌ కూడా స్పందించారు. ఎక్స్‌లో ఆయన స్పందించారు. ' మీ ఉత్తరంతో ఈరోజు నాదైంది. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ నిజంగా ఉన్నత స్థాయికి చేరుకుంది. మీలాంటి సోదరుల ప్రేమ మరియు మద్దతుతో, మా పునరాగమనం ఎదురుదెబ్బ కంటే బలంగా ఉంటుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాని.. ఉత్తరం రాసినందుకు ధన్యవాదాలు' అంటూ కేటీఆర్‌ ఎక్స్‌లో స్పందించారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story