తమపై కక్షపూరితంగా అసత్య ప్రచారం చేస్తున్నాయంటూ పలు టీవీ, సోషల్ మీడియా ఛానెల్స్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు.

KTR sent legal notices to TV and social media channels
తమపై కక్షపూరితంగా అసత్య ప్రచారం చేస్తున్నాయంటూ పలు టీవీ, సోషల్ మీడియా ఛానెల్స్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఈ సందర్భంగా ఆయన ట్విటర్ వేదికగా.. తమకు సంబంధం లేని విషయాల్లో తమను ప్రస్తావిస్తున్న ప్రతి మీడియా సంస్థ, యూట్యూబ్ ఛానెల్స్‌పై న్యాయపరమైన చర్యలతో పాటు పరువు నష్టం కేసులు వేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. కుట్రలో భాగంగా, ఎజెండాలో భాగంగా తమపై జరుగుతున్న ప్రచారాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.
తొమ్మిది మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెల్స్‌తో పాటు నేరుగా యూట్యూబ్ సంస్థకు సైతం కేటీఆర్ నోటీసులు పంపారు. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న సంస్థలు భవిష్యత్తులోనూ నోటీసులతో పాటు, కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కేవలం తనను, కుటుంబాన్ని అగౌరవపరచాలనే కుట్రలో భాగంగా అసత్య ప్రచారాలను, కట్టు కథలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
