జాతీయ అవార్డ్ విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పాలకుల అభద్రతకు పరాకాష్ట అని కేటీఆర్‌ అన్నారు.

జాతీయ అవార్డ్ విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పాలకుల అభద్రతకు పరాకాష్ట అని కేటీఆర్‌ అన్నారు. తొక్కిసలాట బాధితుల పట్ల తనకు పూర్తిగా సానుభూతి ఉంది కానీ నిజంగా ఎవరు విఫలమయ్యారో తేలాలన్నారు. అల్లు అర్జున్‌(Allu Arjun)ను ఒక సాధారణ నేరస్థుడిగా ట్రీట్‌ చేయడం కరెక్టా అని ప్రశ్నించారు. ఈ ఘటనతో అల్లు అర్జున్‌కు నేరుగా సంబంధం లేదన్నారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. అదే దిక్కుమాలిన లాజిక్‌తో వెళితే, హైదరాబాద్‌(Hyderabad)లో హైడ్రా చేసిన భయంతో మరణించిన ఇద్దరు అమాయకుల మరణానికి కారణమైన రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని అరెస్ట్ చేయాలి. కాగా సంధ్య థియేటర్‌(Sandhya theater) ఘటన కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప-2 విడుదల సందర్భంగా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. దీంతో హీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్‌ షో సందర్భంగా హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

Updated On
ehatv

ehatv

Next Story