కేటీఆర్ ప్రెస్ మీట్‌లో రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డిని "దొంగ"గా పేర్కొన్నారు.

కేటీఆర్ ప్రెస్ మీట్‌లో రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డిని "దొంగ"గా పేర్కొన్నారు. "నేను ఎక్కడికి పోయినా నన్ను దొంగను చూసినట్లు చూస్తున్నారని రేవంత్ రెడ్డి(Revanth Reddy) అంటుండు. దొంగను దొంగ అనకపోతే ఇంకేం అంటారు?" అంటూ వ్యాఖ్యానించారు. "అందాల పోటీలకు 250 కోట్లు ఖర్చు చేయడానికి డబ్బులు ఉన్నాయి, కానీ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవా?" అని ప్రశ్నించారు. బీఆర్ఎస్(BRS) అధ్యక్షుడు కేసీఆర్(KCR)ను వ్యక్తిగతంగా దూషించవద్దని హెచ్చరించారు. "చివరిసారిగా చెప్తున్నా రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ని వ్యక్తిగతంగా దూషిస్తే నీ నాలుక చీరేస్తా." అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫోర్త్ సిటీలో 2000 ఎకరాలు ఎట్లా కొన్నావు రేవంత్ రెడ్డి.. అని ప్రశ్నించారు, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆర్థికంగా లబ్ధి పొందినట్లు ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిర్లక్ష్యం చేస్తోందని.. కేటీఆర్(KTR) రాష్ట్ర ఆదాయం పెరగకపోవడానికి రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యమే కారణమని విమర్శించారు., "నీ కుటుంబ సభ్యుల ఆదాయం పెరిగింది, కానీ రాష్ట్ర ఆదాయం ఎందుకు పెరగలేదు?" అని ప్రశ్నించారు.
