తెలంగాణలోని మందు ప్రియులకు ఇది షాకింగ్ వార్తే. రేపటి నుంచి మూడు రోజులు పాటు వైన్స్ షాపులు, బార్లు క్లోజ్ బంద్ చేయబోతున్నారు.

తెలంగాణలోని మందు ప్రియులకు ఇది షాకింగ్ వార్తే. రేపటి నుంచి మూడు రోజులు పాటు వైన్స్ షాపులు, బార్లు క్లోజ్ బంద్ చేయబోతున్నారు. ఫిబ్రవరి 25న సా.4 గంటల నుంచి 27న సాయంత్రం 4 గంటల వరకు లిక్కర్ షాపులు మూసివేయనున్నారు. మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ లలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా.. నల్గొండ – ఖమ్మం – వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఫిబ్రవరి 27న జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా పోలింగ్ జరిగే ఉమ్మడి ఏడు జిల్లాల పరిధిలో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ జరగనుండగా, మార్చి 3న ఓట్ల లెక్కింపునకు ఈసీ(EC) ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో మినహా మిగిలిన చోట మద్యం షాపులు యథాతథంగా నడవనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కారణంగా కేవలం కొల్లూరు, ఆర్సీ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మూడు రోజులపాటు మద్యం షాపులను మూసివేస్తారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులలో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా మద్యం విక్రయించినా, మద్యం సరఫరా చేసినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని మద్యం షాపుల నిర్వాహకులను పోలీసులు హెచ్చరించారు.
