తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని భావించి రైలుకింద పడి ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన భువనగిరి(Bhuvanagiri)లో జరిగింది.

తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని భావించి రైలుకింద పడి ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన భువనగిరి(Bhuvanagiri)లో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ(Janagaon) జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ (Station Ghanpur)మండలం నెమలిగొండ (Nemaligonda)గ్రామానికి చెందిన కోటే వినయ్‌కుమార్‌(Vinay Kumar)(25), రచ్చ శ్రుతి(Shruthi)(23) ఆరోతరగతి నుంచి ఇంటర్‌ వరకు కలిసి చదువుకున్నారు. చిన్ననాటి స్నేహితులైన వారి మధ్య ప్రేమ చిగురించింది. వినయ్‌కుమార్‌ స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ప్రైవేట్‌ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. శ్రుతి బీటెక్‌ పూర్తి చేసి హైదరాబాద్‌(Hyderabad)లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది. ఇద్దరూ వేర్వేరు సామాజికవర్గాలకు చెందినవారు. ఇటీవల శ్రుతికి పెళ్లి సంబంధాలు చూశారు. దీంతో తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని భావించి ఇద్దరూ భువనగిరికి వచ్చారు. పట్టణ సమీపంలో పగిడిపల్లి–భువనగిరి రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం రాత్రి సికింద్రాబాద్‌–విశాఖపట్నం లింక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నా రు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు భువనగిరి రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ కృష్ణారావు తెలిపారు. ఛిద్రమైన మృతదేహాలను చూసి తల్లిదండ్రులు, బంధువులు చేసిన రోదనలు మిన్నంటాయి. స్వగ్రామంలో శ్రుతి, వినయ్‌కుమార్‌ల అంత్యక్రియలు వేర్వేరుగా వారి కుటుంబసభ్యులు చేపట్టారు. ఎలాంటి గొడవలు జరగకుండా సీఐ జి.వేణు ఆదేశాల మేరకు ఎస్‌ఐ వినయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు.

Updated On
ehatv

ehatv

Next Story