జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ టికెట్‌ మాగంటి గోపీనాథ్‌ కుటుంబానికే దక్కుతుందని ఆయన సోదరుడు వజ్రనాథ్‌ అన్నారు.

జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ టికెట్‌ మాగంటి గోపీనాథ్‌ కుటుంబానికే దక్కుతుందని ఆయన సోదరుడు వజ్రనాథ్‌ అన్నారు. జూబ్లీహిల్స్‌లో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ సంస్మరణ సభను గురువారం నిర్వహించగా ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. తన సోదరుడి మరణం తరువాత కార్యకర్తలు మనోవేదనకు గురవుతున్నారని, వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పేందుకే సంస్మరణ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మాగంటి గోపీనాథ్‌ లేని లోటు ఎవరూ పూడ్చలేనదని, ఆయన ఆశయాలను కొనసాగించేందుకు తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు. ఉపఎన్నికల్లో తాను కూడా పోటీ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ విషయం అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లినట్టు కార్యకర్తలకు వివరించారు. అభ్యర్థి ఎంపికలో కేసీఆర్‌, కేటీఆర్‌ తుది నిర్ణయం తీసుకుంటారని, వారు ఎవరికి టికెట్‌ కేటాయించినా వారి గెలుపు కోసం పని చేస్తానని అన్నారు. కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు ఏ అవసరం వచ్చినా నేరుగా తనకు ఫోన్‌ చేయాలని వజ్రనాథ్‌ చెప్పారు.

ehatv

ehatv

Next Story