మీ అమ్మ, నాన్నను చంపేస్తానని యువతిని బెదిరించిన యువకుడు.

తనను ప్రేమించకుంటే ఎయిడ్స్ ఇంజెక్షన్‌(Aids Injection) ఇస్తానని ఓ యువతిని బెదిరించిన(Black mail) ఘటన హైదరాబాద్‌లోని(Hyderabad) హయత్‌నగర్‌లో(Hayathnagar) చోటు చేసుకుంది. అంతేకాదు మీ అమ్మ, నాన్నను చంపేస్తానని యువతిని బెదిరించిన యువకుడు. హైదరాబాద్‌ హయత్ నగర్‌ యువతిపై లైంగిక వేధింపులకు(Sexual harrasment) పాల్పడ్డాడు. చెరుకుపల్లి విజయ్ అనే వ్యక్తి తనకు ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా పరిచయమై ఫ్రెండుగా ఉంటు తరువాత తనను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని తెలిపిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని(Narsing student). ఇద్దరు సరదాగా కలిసి ఉన్న సమయంలో దిగిన ఫోటోస్, విడియోలు అందరికి చూపిస్తా అంటూ వేధిస్తున్నాడు. యువతి కాలేజీ నుంచి వస్తున్న సమయంలో వెంటపడి.. బలవంతంగా తన బైక్ మీద ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం(rape) చేశాడని విద్యార్థిని ఆరోపించింది. చాలా సార్లు కాలేజీలో వెంటబడి కొట్టాడని, బంధువుల అందరికి ఫోన్ చేస్తు మీ బిడ్డని చంపుతా అని బెదిరిస్తున్నాడు అని తననుండి తన కుటుంబానికి ప్రాణహని ఉందని యువతి ఆవేదన చెందింది. యువతి ఇంటికే వచ్చి అడ్డుపడ్డ తన తండ్రి మీద దాడికి దిగాడని అంతేకాకుండా తనకు తెలిసిన కొంత మంది అమ్మాయిలలో ఇలానె బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది. గతంలో కూడా నాగార్జునసాగర్‌లో నిందితుడిపై కేసు నమోదైంది పోలీసులు వెల్లడించారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story