ఇంట్లో ఇల్లాలు, బయట ప్రియురాలితో నలిగిపోయాడా యువకుడు.

ఇంట్లో ఇల్లాలు, బయట ప్రియురాలితో నలిగిపోయాడా యువకుడు. ఇక తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్‌(Hyderabad) మధురానగర్‌(Madhuranagar) పోలీసుస్టేషన్ పరిధిలోని రహ్మత్‌ నగర్‌లో(Rahmat nagar) చోటు చేసుకుంది. రహ్మత్‌నగర్‌కు చెందిన 35 ఏళ్ల కె.రమేశ్‌ ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. కారు డ్రైవర్‌గా(Car driiving) పని చేస్తున్న రమేశ్‌కు ఓ యువతి పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ తరచు కలుసుకునేవరకు వెళ్లింది. ఓ రోజు తన ప్రియురాలితో ఫోన్‌లో మాట్లాడుతూ రమేశ్‌ భార్యకు(wife) దొరికాడు. భార్య గట్టిగా నిలదీయడంతో ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. తనను పట్టించుకోకపోతే ఆత్మహత్య(suicide) చేసుకుంటానని బెదిరిస్తూ ప్రియురాలు వీడియోలు పంపింది. దాంతో రమేశ్‌ భయపడ్డాడు. ఏం చేయాలో పాలుపోక బాత్రూమ్‌లో ఉన్న యాసిడ్‌ తాగి పడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మధురానగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story