ఆర్ధిక ఇబ్బందులు(Financial problems), అప్పుల బాధలు(Debt Problems), కుటుంబ కలహాలు అతడిని చుట్టుముట్టాయి.

ఆర్ధిక ఇబ్బందులు(Financial problems), అప్పుల బాధలు(Debt Problems), కుటుంబ కలహాలు అతడిని చుట్టుముట్టాయి. బతుకు మీద ఆశలు లేకుండా చేసింది. ఆత్మహత్యే(Suicide) శరణ్యమనుకున్నాడు. బేగంపేట రైల్వేస్టేషన్‌లో(begumpet railwaystation) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య, పిల్లలను హత్య చేసిన తర్వాత అతడు ఈ పని చేశాడు. హైదరాబాద్‌ బోయినపల్లిలో(Boinapally) జరిగింది ఈ విషాద ఘటన! అన్యోన్యగా ఉంటున్న ఆ కుటుంబాన్ని చూసి విధికి కన్నుకుట్టినట్టుగా ఉంది. అందుకే విషాదం నింపింది. వృత్తిరీత్యా డాక్టరైన గణేశ్‌ ఫ్యామిలీకి గత కొంతకాలంగా ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. భార్య భర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. అప్పుల బాధలు, భార్యతో గొడవలను తట్టుకోలేకపోయాడు గణేశ్‌. భార్య, పదేళ్ల తన కూతురును హత్య చేసి తను ఆత్మహత్య చేసుకున్నాడు.

స్థానికుల ఇచ్చిన సమాచారంతో బేగంపేట రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్‌బాడీని పోస్ట్‌మార్టం నిమిత్తం పంపించారు. బోయినపల్లి పోలీసులు గణేష్‌ ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీ, ఫోన్‌ కాల్‌ డేటాను పరిశీలిస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story