జగన్ భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాలకు ఆకర్షితుడై

మావోయిస్టుల అగ్రనేత జగన్ మృతి చెందాడు. రెండు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌-బస్తర్‌ జిల్లాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆయన ప్రాణాలు కోల్పోయారని పోలీసులు ప్రకటించారు. మంగళవారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 9 మంది మృతి చెందగా.. అందులో జగన్ కూడా ఉన్నట్టు నిర్ధారించారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న జగన్ అసలు పేరు మాచర్ల ఏసోబు అలియాస్‌ రణ్‌దేవ్‌ దాదా. ఈయన స్వగ్రామం హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలోని టేకులగూడం. జగన్‌ డెడ్‌బాడీని ఛత్తీస్‌గఢ్ నుంచి స్వస్థలానికి తీసుకొచ్చేందుకు ఆయన కొడుకు మహేశ్‌ వెళ్లారు.

జగన్ భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాలకు ఆకర్షితుడై 1990లో పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌ నేత కడారి రాములు అలియాస్‌ రవి నేతృత్వంలో మావోయిస్టుగా మారి అజ్ఞాతంలోకి వెళ్లారు. 1995లో వరంగల్‌ జిల్లా కమిటీ సభ్యుడిగా జగన్ పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ కమిటీ ప్రెస్‌, రక్షణ వ్యవహారాల ప్లటూన్‌ కమాండర్‌గా, కేంద్ర కమిటీ రక్షణ కమాండర్‌గా, కేంద్ర కమిటీ మిలటరీ ఇన్‌చార్జిగా.. ఇలా వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయనపై రూ.25 లక్షల రివార్డు కూడా ఉంది. అయితే మావోయిస్టుగా మారడానికి ముందు చర్చి పాస్టర్‌గా పనిచేశారు.


Updated On
Sreedhar Rao

Sreedhar Rao

Next Story