✕
Bhu Bharati Scam: భూ భారతిలో భారీగా బయటపడుతున్న అక్రమాలు

x
యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లోనే సుమారు రూ.70 కోట్ల వరకు అక్రమాలు జరిగినట్లు గుర్తింపు. యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లోని మీ సేవ, ఇంటర్నెట్ సెంటర్లు, ఆన్లైన్ సేవ కేంద్రాలకు చెందిన 16 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు. వారి బ్యాంకు ఖాతాల్లో రూ.30-40 లక్షల మేర డిపాజిట్లు జరిగినట్లు గుర్తింపు.. బ్యాంకు ఖాతాలు సీజ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటివరకు 1372 డాక్యుమెంట్లలో రూ.4 కోట్ల పైనే అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక గుర్తింపు. భూ భారతి అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, విజిలెన్స్, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ వింగ్‌లను రంగంలోకి దించిన ప్రభుత్వం. జిల్లాల వారీగా సీఐలు, ఎస్ఐలతో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో విచారణ ముమ్మరం చేశారు.

ehatv
Next Story

