తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ అంశం తీవ్ర కలకలం రేపింది. ఏకంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగే కేబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టింది కొండా సురేఖ.

తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ అంశం తీవ్ర కలకలం రేపింది. ఏకంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగే కేబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టింది కొండా సురేఖ. కొన్ని రోజుల క్రితం సురేఖ మాజీ ఓఎస్‌డీ సుమంత్‌ మీద ప్రభుత్వం వేటు వేయడమే కాక.. అతడిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణకు ఆదేశించింది. దీంతో మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సుమంత్‌ని అరెస్ట్ చేయడానికి.. కొండా సురేఖ ఇంటికి వెళ్లిన పోలీసులను ఆమె కూతురు సుస్మిత అడ్డుకున్నారు. అంతటితో ఆగక.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి, ఉత్తమ్‌ కుమార్‌ల మీద కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై విపక్షాలు సైతం విమర్శలు చేస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది.

మూడు రోజుల క్రితం పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డిని కొండా దంపతులు కలిసి ఆయనను సన్మానించారు. ఇక నిన్న జరిగిన కేబినెట్‌ సమావేశంలో కొండా సురేక్ష సీఎం రేవంత్‌కు క్షమాపణలు చెప్పినట్లుగా సమాచారం. మిస్‌ కమ్యూనికేషన్‌తో తమ కూతురు ఆ విధంగా మాట్లాడారని, ఇది టీ కప్పులో తుఫాన్‌లాంటిదేనంటూ మీడియాకు తెలిపారు.

ఆ సమయంలో కొండా సురేఖ పక్కనే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా ఉన్నారు. అందరూ కలిసి ఉన్నట్లు ఒక సందేశం పంపాలన్న ఉద్దేశంతోనే ఇద్దరూ కలిసి ఈ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీంతో వివాదానికి ఎండ్‌ కార్డు పడినట్లేనా.. కాలమే సమాధానం చెప్పాలి.. కానీ రాజకీయ విమర్శకులు మాత్రం ''అంటే మీరూ.. మీరూ.. '' అన్నట్లు ఆశ్చర్యాన్ని వెల్లిబుచ్చుతున్నారట..!

Updated On
ehatv

ehatv

Next Story