కిషన్ రెడ్డి మాటలు చూస్తే ఆశ్చర్యం వేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

కిషన్ రెడ్డి మాటలు చూస్తే ఆశ్చర్యం వేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ హెరిటేజ్ సిటీ.. చారిత్రాత్మక నగర‌మ‌ని.. హైదరాబాద్ నగరానికి సంబంధించి పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర టూరిజం మంత్రిగా గత 5 సంవత్సరాల్లో కేంద్రం నుండి హెరిటేజ్, టూరిజం, ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ల‌ నుండి హైదరాబాద్‌కు ఏం తెచ్చావు.. ఒక్క రూపాయి అయినా తెచ్చావా.. అని ప్ర‌శ్నించారు. కేంద్రం నుండి హైదరాబాద్ స్మార్ట్ సిటీ చేయలేదు.. అమృత్ పథకం నుండి ఒక్క రూపాయి తేలేదన్నారు. 10 సంవత్సరాల బీజేపీ కాలంలో హైదరాబాద్ అభివృద్ధికి, జీహెచ్ఎంసీ అభివృద్ధికి బీజేపీ చేసింది ఏమైనా ఉందా కిషన్ రెడ్డి చెప్పాలన్నారు.

రూపాయి కూడా సహకారం చేయకుండా గత ప్రభుత్వంతో అంటకాగి హైదరాబాద్ ను నిర్లక్ష్యం చేసింది మీరు కాదా అని మండిప‌డ్డారు. స్థానిక సంస్థలకు 73, 74 రాజ్యాంగం ద్వారా వచ్చే 15వ ఫైనాన్స్ నిధులు తప్ప అదనంగా ఒక్క రూపాయి అయినా తెచ్చారా అని ప్ర‌శ్నించారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుండి నిధులు కావాలని అనేక సార్లు విజ్ఞప్తి చేశామ‌ని తెలిపారు. మా మంత్రి వర్గంతో కూర్చొండి.. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేకసార్లు ప్రణాళిక వేసుకుందాం రండి.. మీరు కేంద్ర మంత్రి అయిన తరువాత.. హైదరాబాద్ ఇంచార్జి మంత్రిగా గౌరవంగా మిమ్మల్ని కలవడానికి వచ్చినా.. హైదారాబాద్ అభివృద్ధికి సహకరించాలని కోరామ‌న్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని రాజకీయ ఆట కోసం హైదరాబాద్ ను విమర్శించ‌వ‌ద్ద‌న్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి ముందుకు పోదామ‌ని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రిగా హైదరాబాద్ ప్రజల సమస్యల కొరకు.. నగర అభివృద్ధి కొరకు ఏం చేశారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నుండి ప్రశ్నిస్తున్నాన‌న్నారు. హైదరాబాద్‌ను అంత నిర్లక్ష్యం చేసినట్టు.. అభివృద్ధి కుంటుపడినట్టు మాట్లాడుతున్నారన్నారు.

హైదరాబాద్ హిస్టారికల్ సిటీ.. ఇస్తాంబుల్ నగరం లాంటిదన్నారు. చార్మినార్, గోల్కొండ లాంటి ఆర్కియాలజీకి సంబంధించినవి ఎన్నో ఉన్నాయి.. ఒక్క రూపాయి అయినా ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చారా అని ప్ర‌శ్నించారు.

హైదరాబాద్ లో ఉన్న 151 ప్రాంతాల్లో వర్షం వచ్చినప్పుడు నీటి నిల్వలతో ఇబ్బందులు వస్తున్నాయి అక్కడే ప్రభుత్వ స్థలాల్లో అండర్ గ్రౌండ్ లోకి వాటర్ వెళ్ళే విధంగా ప్రణాళికలు చేస్తున్నాం.. హైదరాబాద్ లో శానిటేషన్ లాంటి కార్యక్రమాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ ఇమేజ్‌కు భంగం కలిగే విధంగా ఉన్న‌ కిషన్ రెడ్డి మాటలు ఖండిస్తున్నామ‌న్నారు.హైదరాబాద్ అభివృద్ధికి చేతనైతే సహాయం చేయండి.. రాజకీయాలకు అతీతంగా ఇంచార్జ్‌ మంత్రిగా ఇక్కడి సమస్యలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామ‌న్నారు.

Eha Tv

Eha Tv

Next Story