✕
ఐఏఎస్ అధికారినితో మంత్రికి ఎఫైర్.. Ntvకి నోటీసులు..!

x
తెలంగాణలో ఓ ఐఏఎస్ అధికారి, ఓ మంత్రి మధ్య జరగుతున్న 'ఆ వ్యవహారం' జరుగుతున్నట్లు ప్రసారం చేసిన ఎన్టీవీకి ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నోటీసులు పంపించింది. మహిళా ఐఏస్‌పై ఓ మంత్రి ఆపేక్ష చూపిస్తున్నారంటూ ఆ న్యూస్ ఛానల్ టెలికాస్ట్ చేయడాన్ని తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఖండించింది. మహిళా అధికారిపై నిరాధార ఆరోపణలు చేశారని మండిపడింది. దీనిని మహిళా ఆఫీసర్లు, సివిల్ సర్వీసెస్‌పై దాడిగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. పబ్లిక్‌గా క్షమాపణలు చెప్పాలని ఆ సంస్థను డిమాండ్ చేసింది. ఇలాంటి దురుద్దేశపూర్వక కంటెంట్‌ను ప్రసారం చేయొద్దని మీడియా సంస్థలను హెచ్చరించింది.

ehatv
Next Story

