రాహుల్ గాంధీ హైదరాబాద్ రాకను ఎద్దేవా చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, "X" వేదికగా రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి ప్రశ్నల వర్షం కురిపించిన ఎమ్మెల్సీ కవిత.

రాహుల్ గాంధీ హైదరాబాద్ రాకను ఎద్దేవా చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, "X" వేదికగా రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి ప్రశ్నల వర్షం కురిపించిన ఎమ్మెల్సీ కవిత. "దారితప్పి తెలంగాణ(Telangana)కు వస్తున్న ఎన్నికల గాంధీకి స్వాగతం.." అంటూ ఎద్దేవా చేశారు. మోసపూరిత హామీలు, అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను రాహుల్ గాంధీ మోసగించారని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం చేశారు. హైదరాబాద్(Hyderabad) పర్యటనలో లాఠీ దెబ్బలు తిన్న సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల(HCU Students)ను రాహుల్ గాంధీ పరామర్శించాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌(Congress) ప్రభుత్వం 16 నెలల పాలనలో ప్రజలను రాచిరంపాన పెట్టిందని, హైడ్రా(Hydra), మూసీ పేరుతో ప్రజల మీదికి బుల్డోజర్లు పంపిందని, లగచర్ల (lagacharla)బంజారా ఆడబిడ్డలపై అర్ధరాత్రి వేళ అఘాయిత్యాలకు ఒడిగట్టిందని, సర్కారు దుశ్చర్యకు అడ్డంకిగా ఉన్నారని బంజారా యువతపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిందన్నారు. రేవంత్‌ రెడ్డి (Revanth reddy)ప్రభుత్వం సాగించిన ఈ రాక్షసకాండను జాతీయ మానవ హక్కుల కమిషన్‌ నిర్దారించింది. కరెంట్‌ పోయిందని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెడితే అరెస్టులు.. వేధింపులు.. బెదిరింపులకు పాల్పడ్డారు. పచ్చని అడవిని సర్వనాశనం చేస్తున్నారని సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులు నిరసనకు దిగితే వారిపై లాఠీల మోతలు.. అక్రమ కేసులు.. అరెస్టులు చేశారు. తెలంగాణ ప్రజలు సోనియాగాంధీని, ప్రియాంకా గాంధీని(Priyanka Gandhi), రాహుల్ గాంధీని నమ్మి అధికారమిస్తే ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తీవ్ర నిర్బంధం, అణచివేతను బహుమతిగా ఇచ్చారు. బీహార్‌(Bihar)లో గ్రూప్‌ -1 బాధితుల గోడు వినాలని వారి పక్షాన గళమెత్తిన మీరు.. తెలంగాణలో గ్రూప్‌ -1 అభ్యర్థుల ఆందోళనలపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారంటీల పరిస్థితి ఏమిటి ? రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని సగానికే పరిమితం చేశారు.

దేశానికి ఆదర్శంగా నిలిచిన రైతుబంధు పథకానికి తూట్లు పొడిచి ఆ పథకాన్ని నిర్వీర్యం చేశారు.. అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీయరెందుకన్నారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఏమైందని.. మహిళలకు నెలకు రూ.2500 ఏమయ్యాయన్నారు. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు ఎప్పుడు ఇస్తారని, ఆరు గ్యారంటీలు, 420 హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. ఎర్ర బుక్కు పట్టుకుని రాజ్యాంగాన్ని రక్షించాలంటూ దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవ హక్కులను మంటకలుపుతూ.. దమనకాండ కొనసాగిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె రాహుల్‌ను ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు.

ehatv

ehatv

Next Story