బీఆర్ఎస్ నేత, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అనర్హత పిటీషన్‌పై సుప్రీంకు వెళ్లిన బీబీ పాటిల్‌ను ధర్మాసనం.. ఆ విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆయన పిటిషన్‌ను తీసిపుచ్చింది.

MP Bibi Patil’s setback in the Supreme Court
బీఆర్ఎస్ నేత(BRS Leader), జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్(Zaheerabad MP BB Patil)కు సుప్రీంకోర్టు(Supreme Court)లో ఎదురుదెబ్బ తగిలింది. అనర్హత పిటీషన్‌పై సుప్రీంకు వెళ్లిన బీబీ పాటిల్‌ను ధర్మాసనం.. ఆ విషయాన్ని హైకోర్టు(High Court)లోనే తేల్చుకోవాలని ఆయన పిటిషన్‌ను తీసిపుచ్చింది. బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదంటూ కే మదనమోహన్ రావు(K Madanmohan Rao) అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో పిటీషన్ వేయగా.. రోజువారీ విచారణకు న్యాయస్థానం ఆదేశించింది. ఈ తీర్పును బీబీ పాటిల్ సుప్రీంలో సవాల్ చేశారు. అక్కడ ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో హైకోర్టులో తిరిగి విచారణ జరగనుంది.
