హైదరాబాద్‌లోని మియాపూర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, వారంతా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మక్తమహబూబ్‌పేటలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా స్థానికులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, వారంతా విషం తీసుకుని చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు విచారణ చేపట్టినట్టు తెలిపారు. మృతులను అత్త, మామ, భార్య, భర్త, రెండేళ్ల చిన్నారిగా గుర్తించారు. భార్యభర్తలు.. అనిల్, కవిత, అప్పు, కవిత పేరెంట్స్‌గా తెలుస్తోంది. వీరంతా కర్ణాటకకు చెందినవారని సమాచారం.
