తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన అసహ్యకరమైన వ్యాఖ్యలపై హీరో అక్కినేని నాగార్జున కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే.

తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన అసహ్యకరమైన వ్యాఖ్యలపై హీరో అక్కినేని నాగార్జున కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. నాంపల్లి మనోరంజన్ కోర్టు(Nampally Manoranjan Court)లో ఆయన పరువు నష్టం దావా వేశారు. నాగార్జున(Akkineni Nagarjuna) పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన కోర్టు మంగళవారం పిటిషనర్‌ నాగార్జున స్టేట్‌మెంట్‌ రికార్డు చేస్తామని చెప్పింది. నాగార్జున తరఫు వాదనలు వినిపించిన సీనియర్‌ కౌన్సిల్ అశోక్‌రెడ్డి(Ashok Reddy) మంగళవారం నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేయాలని కోరారు. తదుపరి విచారణను నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది.

Updated On
ehatv

ehatv

Next Story