జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.

జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చల్ గల్ గ్రామానికి చెందిన జంగా పూజ(Janga Pooja)(18) అనే విద్యార్థిని ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. నీట్ పరీక్ష రాసిన తర్వాత పేపర్ ను క్రాస్ చెక్ చేసుకుని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రెండేళ్ల క్రితం రాసిన నీట్ పరీక్షలో ర్యాంకు రాకపోవడంతో మరోసారి నీట్ పరీక్ష రాసింది. అయితే ఇంటికి వచ్చిన తర్వాత పేపర్‌ను క్రాస్ చెక్ చేసుకుని ర్యాంకు రాదనే ఆందోళన చెందింది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. జగిత్యాల(Jagtial) జిల్లాలోని రెండు కేంద్రాల్లో నిర్వహించిన నీట్‌ పరీక్ష (,NEET exam)ప్రశాంతంగా ముగిసింది. నాచుపల్లి జేఎన్టీయూ(JNTU) కేంద్రాన్ని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ (Satya prasad)తనిఖీ చేశారు. అక్కడి అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. విద్యార్థులు ఇబ్బందులు లేకుండా పరీక్ష రాసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఒక సెంటర్‌లో 480, రెండో సెంటర్లో 278 మంది పరీక్ష రాశారని పేర్కొన్నారు. ఒక కేంద్రంలో 13 మంది, మరో కేంద్రంలో ఐదుగురు గైర్హాజరైనట్లు తెలిపారు. మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు ఓ విద్యార్థిని పరీక్షకు దూరమైంది.

ehatv

ehatv

Next Story