ఈ రోజు నుంచి సోమశిల(somashila) నుంచి శ్రీశైలానికి(Srisailam), నాగ‌ర్జున సాగ‌ర్(Nagarjuna sagar) నుంచి శ్రీశైలానికి లాంచీ (Cruise services) సేవ‌లు ప్రారంభం అవుతున్నాయి.

ఈ రోజు నుంచి సోమశిల(somashila) నుంచి శ్రీశైలానికి(Srisailam), నాగ‌ర్జున సాగ‌ర్(Nagarjuna sagar) నుంచి శ్రీశైలానికి లాంచీ (Cruise services) సేవ‌లు ప్రారంభం అవుతున్నాయి. కృష్ణ‌మ్మ ఒడిలో, న‌ల్ల‌మ‌ల ప‌చ్చ‌ద‌నం అందాలను వీక్షిస్తూ కృష్ణా నదిలో సాగే జల విహారానికి తెలంగాణ పర్యాట‌క శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల కోసం టూర్ ప్యాకేజీకి సంబంధించిన ఇతర వివరాలు, బుకింగ్​ కోసం https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించి, పూర్తి వివ‌రాలు తెలుసుకోవొచ్చు.

సోమశిల నుంచి శ్రీశైలం వరకు, నాగ‌ర్జున సాగ‌ర్ నుంచి శ్రీశైలం వ‌ర‌కు సింగిల్‌ రైడ్‌తో పాటు రౌండప్‌ క్రూయిజ్‌ జర్నీ ధరలను నిర్ణ‌యించారు. ఈ రెండు వేర్వేరు ప్యాకేజీల‌కు ఒకే ర‌క‌మైన‌ టికెట్ ధరలే వర్తిస్తాయి. సింగిల్‌ జర్నీలో పెద్దల‌కు రూ.2000, చిన్నారులకు రూ.1,600, రౌండప్ (రానుపోను) జర్నీలో పెద్దల‌కు రూ.3,000, పిల్లలకు రూ.2,400 రేటు ఉంది. ఈ ప్యాకేజీలో లాంచీ ప్రయాణంతోపాటు టీ, స్నాక్స్‌ అందించనున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story