పెళ్లైన రెండు నెలలకే భర్త వేధింపులు భరించలేక ఉరేసుకొని నవవధువు ఆత్మహత్య చేసుకుంది.

పెళ్లైన రెండు నెలలకే భర్త వేధింపులు భరించలేక ఉరేసుకొని నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం(Khammam) జిల్లా కొణిజర్ల మండలం సాలె బంజర గ్రామంలో తమ ఒక్కగానొక్క కూతురు పూజిత(19)ను, ఇంటి సమీపంలోని జాటోతు శ్రీనివాస్‌కు ఇచ్చి ఏప్రిల్ 16న పెళ్లి చేసిన మాలోతు శ్రీను, నాగమణి దంపతులు. కేపీహెచ్‌బీ(KPHB)లో నివాసముంటూ ఓ జ్యువెలరీ షోరూంలో సేల్స్‌మెన్‌గా పనిచేసే శ్రీనివాస్. కొన్నాళ్ల కిందట ఊళ్లో ఉన్న సమయంలో పూజిత (Poojitha)బంధువులతో కలిసి కూల్‌డ్రింక్ తాగడం వీడియో తీసి శ్రీనివాస్‌కు వాట్సాప్‌లో పంపిన అతని అన్న, అల్లుడు. అప్పటి నుంచి తమకు పడని వాళ్లతో కూల్‌డ్రింక్ ఎందుకు తాగవని ఆమెను వేధించిన శ్రీనివాస్(Srinivas). శ్రీనివాస్ వేధింపులు తట్టుకోలేక శనివారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన పూజిత. ఒక్కగానొక్క కూతురు పెళ్లైన రెండు నెలలకే లోకాన్ని విడిచి వెళ్ళిందని గుండెలవిసేలా రోదించిన పూజిత తల్లిదండ్రులు

Updated On
ehatv

ehatv

Next Story