ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్(Ola Electric Mobility Private Limited) లోప‌మున్న నాసిర‌కం ఈ-స్కూటర్‌ను డెలివరీ చేసినందుకు ఓ వ్య‌క్తికి రూ. 1,92,205 చెల్లించాలని సంగారెడ్డి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (DCDRC) ఉత్తర్వులు జారీ చేసింది.

వివ‌రాళ్లోకెళితే.. జహీరాబాద్‌(Zaheerabad)కు చెందిన మద్ది డేవిడ్‌(Maddi David)కు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్(Electric Scooter) పని చేయడం ఆగిపోయింది. జులై 3, 2023న అత‌డు స్కూటర్ కొనుగోలు చేయ‌గా.. రెండు రోజులకే పని చేయడం ఆగిపోవడం.. ఇబ్బందులు తలెత్తడంతో విషయం కోర్టుకు చేరింది.

కొన్ని రోజుల్లో స్కూటర్‌ను తిరిగి ఇస్తామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ హామీ ఇచ్చినప్పటికీ.. సమస్యను పరిష్కరించడంలో కంపెనీ విఫలమైందని డేవిడ్ అన్నారు.

జులై 23 నుంచి 30 రోజుల్లోగా ఆదేశాలను పాటించాలని కంపెనీని కోర్టు(Court) ఆదేశించింది. కోర్టు ఆర్డర్ ప్రకారం.. కొనుగోలు తేదీ నుండి తొమ్మిది శాతం వడ్డీ రేటుతో అస‌లును.. 30,000 పరిహారం గానూ చెల్లించాలని కంపెనీని కోర్టు ఆదేశించింది.

Updated On
Sreedhar Rao

Sreedhar Rao

Next Story