నాగర్ కర్నల్(Nagarkurnool) జిల్లా బిజినేపల్లి(Biginepally) మండలం వట్టెం ఐకేపీ వడ్ల కొనుగోలు సెంటర్‌కు(IPK Paddy Purchase center) స్థానిక రైతులు ధాన్యం తీసుకొచ్చారు.

నాగర్ కర్నల్(Nagarkurnool) జిల్లా బిజినేపల్లి(Biginepally) మండలం వట్టెం ఐకేపీ వడ్ల కొనుగోలు సెంటర్‌కు(IPK Paddy Purchase center) స్థానిక రైతులు ధాన్యం తీసుకొచ్చారు. ఐకేపీ ఉద్యోగులు 5 మందికి చెందిన 800 బస్తాల 320 క్వింటాళ్ల ధాన్యాన్ని ఆన్ లైన్లో గుడిపల్లిలోని సీతారామాంజనేయ రైస్ మిల్లును(Rice mill) ఎంపిక చేసి ట్రక్ షీట్(ఏపీ04 టీవీ 0985)ను లారీ డ్రైవర్ రాజుకు అప్పగించారు. వడ్ల లారీ ఎంతకూ చేరకపోడంతో అధికారులు అనుమానంతో విచారించారు. అక్కడి నుంచి వెళ్లిన డ్రైవర్, లారీ ఓనర్‌తో కుమ్మక్కె రాత్రికి రాత్రే వట్టెం ఏరియాలోని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన తుల్జా భవాని అనే రైస్ మిల్లుకు అక్రమంగా ధాన్యం తరలించినట్లు తెలిసింది. ఇది కాస్త బయటికి పొక్కడంతో ఉన్నతాధికారులు వార్నింగ్ ఇవ్వడంతో మిల్లు నుంచి లారీల్లో లోడ్ చేసుకుని గుడిపల్లి రైస్ మిల్‌కు తరలించారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story