తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(revanth reddy) పరిపాలనలో ఫెయిలయ్యారని విమర్శించారు ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(revanth reddy) పరిపాలనలో ఫెయిలయ్యారని విమర్శించారు ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan). ఓట్ల కోసం ఆరు గ్యారంటీలని(Super six) ప్రజలను మభ్యపెట్టి ఇప్పుడు ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని అన్నారు. హామీల అమలులో రేవంత్‌రెడ్డి చేతులెత్తేశారని చెప్పారు. నిర్మల్‌ జిల్లా కుభీర్‌ మండలానికి ఆనుకుని ఉన్న పాలజ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్‌ కల్యాణ్ పాల్గొన్నారు. మహారా:లోని బోఖర్‌ తాలూకాలో ఉన్న పాలజ్‌ సభలో పవన్‌తో పాటు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌రావ్‌ చౌహాన్‌ కూడా పాల్గొన్నారు.

భోఖర్‌ మహాయుతి అభ్యర్థి జయాచౌహాన్‌, నాందేడ్‌ ఎంపీ అభ్యర్థి సంతుక్‌రావు అంబర్టే తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌, అశోక్‌రావు చౌహాన్‌ సభలో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో రిజర్వేషన్ల కోసం కులాలను రెచ్చగొట్టి కులరాజకీయాలకు తెరలేపారని విమర్శించారు. హామీల అమలుతోపాటు పరిపాలనలో ఫెయిల్‌ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టి మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు కొల్లగొట్టాలని అనుకుంటున్నదని పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story