కాంగ్రెస్(congress) పార్టీ మునుగోడు(Munugodu) నియోజకవర్గ ఇంఛార్జ్ చల్లమల్ల కృష్ణారెడ్డి(Chalamala Krishna Reddy) ఇంటిముందు పలువురు ధర్నాకు దిగారు. దిల్‌షుక్ నగర్(Dilshuknagar) చైతన్యపురిలోని(chaithanyapuri) కృష్ణారెడ్డి ఇంటికి చేరుకున్న వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల ఆరవ తేదీన కృష్ణారెడ్డి కొడుకు వివాహం జరిగింది.

Krishna Reddy
కాంగ్రెస్(congress) పార్టీ మునుగోడు(Munugodu) నియోజకవర్గ ఇంఛార్జ్ చల్లమల్ల కృష్ణారెడ్డి(Chalamala Krishna Reddy) ఇంటిముందు పలువురు ధర్నాకు దిగారు. దిల్‌షుక్ నగర్(Dilshuknagar) చైతన్యపురిలోని(chaithanyapuri) కృష్ణారెడ్డి ఇంటికి చేరుకున్న వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల ఆరవ తేదీన కృష్ణారెడ్డి కొడుకు వివాహం జరిగింది. పెళ్లి ఈవెంట్‌కు పనిచేసిన లేబర్.. కృష్ణారెడ్డి డబ్బులు ఇవ్వకుండా నానా బూతులు తిడుతున్నారని.. పైసలు అడిగేందుకు వెళ్లిన యువతి పట్ల మిస్ బిహేవ్ చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేరు చెప్పి లేబర్ ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోయారు. పని చేయించుకుని డబ్బులు ఎగ్గొట్టాడని.. రూ. 7 లక్షలు ఇచ్చేవరకూ ఇక్కడి నుంచి కదలమని నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈవెంట్ చేసిన బృందం. పోలీసులు సర్దిచెప్పేందుకు యత్నించినా వారు మాట వినకపోవడం విశేషం. ఈ విషయమై కృష్ణారెడ్డి స్పందించాల్సివుంది.
