తన తండ్రి డబ్బు తీసుకున్నందుకు తనను పోలీసులు విచారణకు పిలవడాన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

తన తండ్రి డబ్బు తీసుకున్నందుకు తనను పోలీసులు విచారణకు పిలవడాన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నాచారంలోని తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి కేసులో విచారణ కోసం పోలీస్‌స్టేషన్‌కు పిలవడంపై దీప్తి మనస్తాపం చెందింది. రెండేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటున్న దీప్తి తండ్రి సంగీతరావు. అనిల్ అనే అతని భార్యకు ఉద్యోగం ఇప్పిస్తానని 15లక్షలు సంగీతరావు తీసుకున్నారు. ఉద్యోగం ఇప్పించకపోగా15 లక్షలకు 8లక్షలే చెల్లించారని పీఎస్‌లో అనిల్ ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై కూతురు దీప్తిని పోలీస్‌స్టేషన్‌కు పిలవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. అంతకు ముంద తాను సెల్ఫీ వీడియో తీసుకుంది. అందులతో తనను పోలీసులు విచారణకు పిలిచారని అవమానభారంతో యువతి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వెల్లడించింది.

తండ్రి తీసుకున్న డబ్బులకు తనను వేధిస్తున్నారని మనస్తాపం చెందింది. సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడిన పీహెచ్ డీ విద్యార్ధిని దీప్తి. ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి పోలీసులు వేధింపులే కారణమని వీడియోల కంటతడి పెట్టుకున్న దీప్తి.

Updated On
ehatv

ehatv

Next Story