గోషామహల్(Gosh mahal) ఎమ్మెల్యే రాజాసింగ్(Raja singh) వద్ద గుర్తు తెలియని కొందరు వ్యక్తులు రెక్కి(Rekki) నిర్వహిస్తున్నట్లుగా తెలియడంతో స్థానికంగా కలకలం రేగింది.

గోషామహల్(Gosh mahal) ఎమ్మెల్యే రాజాసింగ్(Raja singh) వద్ద గుర్తు తెలియని కొందరు వ్యక్తులు రెక్కి(Rekki) నిర్వహిస్తున్నట్లుగా తెలియడంతో స్థానికంగా కలకలం రేగింది. అది గమనించిన స్థానికులు వెంటనే అనుమానస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మంగళ్‌హాట్ పోలీసులు ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ ఇద్ద‌రినీ బోరబండ ప్రాంతానికి చెందిన ఇస్మాయిల్, మొహమ్మద్ ఖాజాగా పోలీసులు గుర్తించారు.

ఈ ఇద్దరు వ్యక్తులకు బోరబండ(Borabanda) ప్రాంతంలోని ప‌లువురితో గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వారిని భయపెట్టేందుకే రాజాసింగ్ ఇంటి ఫోటో తీసి స్టేటస్‌లో పెట్టేందుకు వ‌చ్చామ‌ని.. ఆ ఫోటోలు చూసి మా ప్ర‌త్య‌ర్ధులు రాజాసింగ్ తో మాకు పరిచయాలు ఉన్నాయని అనుకుంటారని.. అందుకే పోటోల‌ను తీసి స్టేటస్ లో పెట్టామని పోలీసులతో చెప్పారు. ఇద్దరు వ్యక్తులు చెప్పేది నిజమా.. అబద్దమా‌.. వేరే ఏదైనా ఉద్దేశంతోనే అక్కడ తిరుగుతున్నారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story