నాగర్‌కర్నూలు(Nagar Kurnool) జిల్లా లింగాల ఎస్సై(Police SI) వార్తల్లోకి ఎక్కాడు.

నాగర్‌కర్నూలు(Nagar Kurnool) జిల్లా లింగాల ఎస్సై(Police SI) వార్తల్లోకి ఎక్కాడు. ఏదో మంచి పని చేసి వార్తల్లోకి ఎక్కాడనుకుంటున్నారా.. కాదు కాదు.. తన ఈగోను హార్ట్‌ చేశారని కోపం పెంచుకున్నాడు. ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోనే(Police station) ముగ్గురు యువకులకు గుండుకొట్టించి(Bald) వార్తల్లోకి ఎక్కాడు. లింగాలలోని ఓ పెట్రోల్ బంకులో(Petrol) పెట్రోల్ విషయంలో యువకులు, సిబ్బంది మధ్య ఘర్షణ చెలరేగింది. పెట్రోల్ బంక్ యాజమాన్యం ఫిర్యాదుతో యువకులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయితే ముగ్గురు యువకుల్లో ఒకడు ఎస్సై ముందు నిల్చోని తల దువ్వుకోవడంతో ఎస్సైకి అంతులేని కోపం వచ్చింది. ఆగ్రహంతో రగిలిపోయిన ఎస్సై ముగ్గురు యువకులకు గుండుకొట్టించాడు. ఆ తర్వాతి రోజు మనస్తాపంతో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని గమనించిన కుటుంబసభ్యులు, స్థానికుల సాయంతో హుటాహుటీన నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story