భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లా అతలాకుతలం అవుతోంది.

భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లా అతలాకుతలం అవుతోంది. వాగులు పొంగుతున్నాయి. తన నియోజకవర్గం పాలేరులో యాకూబ్‌(Yaqub) అనే ఇటుకలు తయారుచేసే కూలి కుటుంబం వరదలో కొట్టుకుపోయింది. ఇది తెలిసి పొంగులేటి(Ponguleti srinivas) కన్నీరు పెట్టుకున్నారు. యాకూబ్‌ కొడుకును మాత్రమే రెస్క్యూ టీమ్‌ కాపాడగలిగింది. మిగతావారి జాడ ఇప్పటి వరకు లభించలేదు. హెలికాఫ్టర్‌ కోసం ప్రయత్నించినప్పటికీ వాతావరణం సహకరించడం లేదని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులు దొరకాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story